English | Telugu

పవన్, వెంకీ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్

పవన్, వెంకీ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ కలసి నటించబోయే సినిమాకి ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూరుస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. మన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు బాగానే వచ్చేవి. కానీ మన యువ హీరోల హయాంలో ఎందుకనో మల్టీ స్టారర్ సినిమాలు బొత్తిగా మృగ్యమైపోయాయి.

రవితేజ, జగపతి బాబు, అల్లు అర్జున్, మనోజ్ కుమార్ లు మాత్రం కాస్తో కూస్తో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించటానికి ఆసక్తి సూపిస్తారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ కలసి హీరోలుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మరియూ పవన్ కళ్యాణ్‍ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్లపై, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించబోతున్న సినిమాలో నటించబోతున్నారట. ఈ సినిమాకి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం.