English | Telugu
దర్శకుడు సుకుమార్ ని అభినందించిన పవన్
Updated : May 12, 2011
దర్శకుడు సుకుమార్ ని అభినందించిన పవన్ కళ్యాణ్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" చిత్రం ఘనవిజయం సాధించి, విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ ని పిలిచి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల పాత్రల రూపకల్పన అటు ప్రేక్షకులతో పాటుగా పవర్ స్టార్ కు బాగా నచ్చిందట. ఈ చిత్రం స్క్రీన్ ప్లేతో పాటు పాటలు కూడా ఎంతో సందర్భోచితంగా ఉన్నాయనీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారట. పనిలో పనిగా తనతో కూడా ఒక చక్కని చిత్రాన్ని ప్లాన్ చేయమని కూడా పవన్ కళ్యాణ్ అడిగినట్లు సమాచారం. అంటే అతి త్వరలో సుకుమార్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక మంచి సినిమాని మనం ఆశించవచ్చు ఏమంటారు...?