English | Telugu
పవన్ కళ్యాణ్ కి సిద్ధార్థ లవ్ లెటర్
Updated : Jul 19, 2011
పవన్ కళ్యాణ్ కి సిద్ధార్థ లవ్ లెటర్ వ్రాసాడంటే దయచేసి ఇదేదో "దోస్తానా" సినిమా టైపు అనుకుంటారేమో...కాదండీ...వివరాల్లోకి వెళితే తను ప్రేమిస్తున్న శృతి హాసన్ కోసం యువ హీరో సిద్ధార్థ ఒక లెటర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వ్రాశాడు. ఆ లెటర్ సారాంశమేమిటంటే శృతి హాసన్ ని తానెంతగా ప్రేమిస్తున్నాడో...ఆమె ఎంత ప్రతిభావంతురాలైన నటీమణో వివరిస్తూ, పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే హిందీ "దబాంగ్" తెలుగు రీమేక్ "గబ్బర్ సింగ్" చిత్రంలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవలసిందిగా ప్రార్థించాడట. ఇంతకీ అది శృతి హాసన్ కి హీరోయిన్ గా ఆయన సినిమాలో వేషం ఇవ్వమన్నరికమేండేషన్ లెటరో, లేక సిద్ధార్థకి శృతి హాసన్ మీదున్న ప్రేమని తెలియజేసే లవ్ లెటరో అర్థం కాక పవన్ కళ్యాణ్ తలపట్టుకుంటున్నాడట. నిజమే కదా...శృ హాసన్ కి వేషం ఇవ్వమని అడగటం ఒక పద్ధతి...కానీ ఆమెను తానెంత ప్రేమిస్తున్నాడో కూడా ఆ లెటర్ లో వ్రాయటం అవసరమంటారా...?