English | Telugu
పవన్ పార్టీ పేరు ఖరారు
Updated : Mar 12, 2014
పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మార్చి14న పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే పవన్ పెట్టబోయే పార్టీ ఇదేనంటూ ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో పేరు వినిపిస్తుంది. పవన్ పెట్టబోయే పార్టీకి "జనసేన పార్టీ" అని నిర్ణయించినట్లు తెలిసింది. ఎలక్షన్ కమీషన్ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాబట్టి పవన్ రాజకీయ ఎంట్రీ ఖాయమైనట్లేనని అర్థమవుతుంది.
పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయి. కానీ పవన్ రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లోకి వచ్చి తనకున్న మంచి పేరును, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పోగొట్టుకోవద్దని... సినిమాల్లోనే నటిస్తేనే బాగుంటుందని సినీ పరిశ్రమతో పాటు కొన్ని వేలకోట్ల మంది కోరుకుంటున్నారు. మరి పవన్ ఎవరి మాట వినబోతున్నాడు? ఇన్ని రోజులు తనను అభిమానించిన అభిమానుల మాట? లేదా ఈ బురద రాజకీయాల మాట? ఏదేమైనా పవన్ రాజకీయ ఎంట్రీ వివరాల గురించి మార్చి 14 వరకు వేచి చూడాల్సిందే.