English | Telugu

క్రిష్ పవర్ స్టార్ మాత్రమేనంట !

 

హిందీలో ఘనవిజయం సాధించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోడ్రన్ కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, మధ్య తరగతి మనిషి పాత్రలో వెంకటేష్ నటించబోతున్నారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయన స్థానంలో నటుడు విక్రమ్ ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో మోడ్రన్ కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ మాత్రమే నటించబోతున్నారని తెలిసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడం వలన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం కాస్త ఆలస్యమవుతుందని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అందిన సమాచారం.

సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు.