English | Telugu
నాగ్.. చైతూ.. మాట్లల్లేవా??
Updated : May 6, 2017
నాగార్జునకీ, నాగచైతన్యకీ మాటల్లేవా?? ఇద్దరి మధ్యా మళ్లీ గ్యాప్ పెరిగిందా?? దానికి సమంతనే కారణమా?? అవుననే గాసిప్పులు వినిపిస్తున్నాయి. సమంతతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నప్పటి నుంచీ నాగ్‌కీ, చైతూకీ మధ్య గ్యాప్ మొదలైందని అనుకొంటున్నారంతా. కానీ.. సమంతతో పెళ్లికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య గ్యాప్ అనేది మీడియా సృష్టే అనేది అర్థమైపోయింది. `మా అమ్మే నా కోడలుగా వస్తోంది` అని నాగ్ ట్వీట్ చేయడంతో సమంత అంటే నాగ్‌కి ఎంత ఇష్టమో అర్థమైపోయింది. అయితే.. మళ్లీ తండ్రీ కొడుకుల మధ్య గ్యాప్ మొదలైందని, ఇద్దరి మధ్యా మాటల్లేవని తెలుస్తోంది. సమంత సినిమాల్లో నటించడం నాగ్‌కి ఏమాత్రమూ ఇష్టం లేదని, ఆ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా చైతూగానీ, సమంత గానీ పట్టించుకోవడం లేదని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో నాగ్ `రాజుగారి గది 2`లో నటించాల్సివచ్చిందని, ఈ సెట్లో సమంత ప్రవర్తన నాగ్‌కి చికాకు పుట్టించిందని, దాంతో మరోసారి `సమంత సినిమాల్లో నటించకూడదు` అని చైతూతో గట్టిగా చెప్పాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గాసిప్పులు చక్కర్లు కొడుతున్నాయి. సమంత సినిమాల్లో నటించడం నాగ్‌కి ఇష్టం లేకపోతే.. రాజుగారి గదిలో కలసి ఎలా నటిస్తారు?? ఇది కేవలం గాసిప్ మాత్రమే అంటూ అక్కినేని అభిమానులు చెబుతున్నారు. నిజానిజాలేంటో నాగ్ కుటుంబానికే తెలియాలి.