English | Telugu

ప‌వ‌న్ అంటే దాస‌రికి ఎంత ముద్దో..!

చిత్ర‌సీమ‌లో కొన్ని అనుబంధాలు, ఇంకొన్ని సంబంధాలు చిత్ర‌విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవ‌రు మిత్రుల‌వుతారో, ఎప్పుడు ఎవ‌రు శ‌త్రువుల‌వుతారో చెప్ప‌లేం. మెగా కుటుంబానికీ, దాస‌రి నారాయ‌ణ‌రావుకీ మ‌ధ్య `చిరుబుర్రులాట‌` కొంత‌కాలం కొన‌సాగింది. రామ్‌చ‌ర‌ణ్ సైతం దాస‌రిపై ఓ సందర్భంలో నోరుజార‌డం, దానికి దాస‌రి కౌంట‌ర్ ఇవ్వ‌డం చూశాం. చిరంజీవిని ఉద్దేశించి దాస‌రి ఇన్‌డైరెక్టుగా సైట‌ర్లు వేసిన సంగ‌తి మెగా ఫ్యాన్స్‌కి గుర్తే. అయితే ఇప్పుడు దాస‌రి సైతం.. ప‌వ‌న్ మాయ‌లో ప‌డిపోయి, ప‌వ‌న్ గురించి పాజిటీవ్ గా స్పందించ‌డం ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తోంది. ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ గురించీ, వవ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి తొలిసారి నోరు విప్పారు దాస‌రి. ''ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనూరాణిస్తాడు... ఆ న‌మ్మ‌కం నాకుంది'' అంటూ ప‌వ‌న్ కి దాస‌రి బూస్ట‌ప్ ఇచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ దాస‌రి వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నారు. చిరంజీవి ప్ర‌జారాజ్యం స్థాపించిన‌ప్పుడు ఒక్క మాట కూడా పాజిటీవ్ గా మాట్లాడ‌ని దాస‌రి, త‌మ్ముడ్ని మాత్రం వెన‌కేసుకురావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. ''ప‌వ‌న్ చాలా నిజాయ‌తీ ప‌రుడు. ఇచ్చిన మాట మీద నిల‌బ‌డి ఉంటాడు. జ‌నం కూడా ప‌వ‌న్ వెంట ఉన్నారు'' అంటూ ప‌వ‌న్‌ని కీర్తించ‌డం.. ప‌రిశ్ర‌మ‌కు సైతం షాక్ ఇచ్చింది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ తో దాస‌రి ఓ సినిమా చేయబోతున్నారు. త‌న హీరో గురించి దాస‌రి ఇలా పాజిటీవ్ గా మాట్లాడ‌డం వింతేముంద‌ని కొంత‌మంది అంటున్నా... ప‌వ‌న్ నిజాయ‌తీ దాస‌రిని సైతం ఆక‌ర్షించి ఉంటుంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు.