English | Telugu

మహేష్ భార్య ఓవ‌రాక్షన్ ను త‌ట్టుకోలేక‌పోతున్నారు..!

మ‌హేష్ బాబు డేట్లు కావాలా?
మ‌హేష్ బాబు క‌థ వినాలా?
మ‌హేష్ బాబు తో మ‌ాట్లాడాలా??
అయితే ముందుగా మీరు న‌మ్ర‌త మేడ‌మ్‌ని క‌ల‌వాల్సిందే. ఆవిడ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట ఇది. మ‌హేష్ పై న‌మ్ర‌త ప్రాబ‌ల్యం ఎంత ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. ఆఖ‌రికి మ‌హేష్ నిర్మాత‌ల్ని కూడా న‌మ్ర‌త త‌న చెప్పుచేత‌ల్లో ఉంచుకుంటోంద‌ట‌.
సెట్లో నమ్రత హ‌వా చూసి.. ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం అవాక్క‌వుతున్నార‌ని, న‌మ్ర‌త‌కు ఎదురుచెప్ప‌లేక‌, న‌మ్ర‌త డిమాండ్లు త‌ట్టుకోలేక.. అడ క‌త్తెర‌లో పోక చెక్క‌గా మిగిలిపోయార‌ని టాక్‌. మ‌హేష్ సినిమా విడుద‌ల ఎప్పుడు, ఆడియో ఫంక్ష‌న్ ఎక్క‌డ చేయాలి? ఎవ‌రెవ‌ర్ని పిల‌వాలి? అనే విష‌యాల్లో కూడా న‌మ్ర‌త జోక్యం చేసుకోవ‌డంతో, ద‌ర్శ‌క నిర్మాత‌ల పరిస్థితి క‌క్క‌లేక మింగ‌లేక అన్న‌ట్టు త‌యారైంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది వ‌ర‌కు మ‌హేష్ కాస్ట్యూమ్స్ విష‌యంలోనే నమ్రత జోక్యం చేసుకొనేద‌ని, ఇప్పుడు అలా కాద‌ని.. మ‌హేష్ సినిమాకి సంబంధించిన స‌మ‌స్తం ఆమె చెప్పుచేత‌ల్లోనే న‌డ‌వాల‌ని మ‌హేష్ తో సినిమాలు తీసిన‌, తీస్తున్న నిర్మాత‌లు చెవులు కొరుక్కొంటున్నారు. బ్ర‌హ్మోత్స‌వం విష‌యంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంద‌ట‌. ఆడియో ఫంక్ష‌న్ ని శిల్ప‌క‌ళావేదిక నుంచి జెఆర్సీకి మార్చ‌డం వెనుక కూడా... నమ్ర‌త సూచ‌న‌లు ఉన్నాయ‌ని టాక్‌. ఇవ‌న్నీ తెలిసి కూడా మ‌హేష్‌ కామ్‌గా ఉంటున్నాడ‌ట‌. అలాగైతే సూప‌ర్ స్టార్ ప‌రిస్థితి ఏమిటో అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.