English | Telugu

స‌మంత కోసం నితిన్‌ని వాడుకొన్నారా??

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఆ సినిమాలో హీరో ఎవ‌రు?? ఈ ప్రశ్న‌కు ఎవ‌రైనా నితిన్ అని స‌మాధానం చెబుతారు. కానీ... ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌.. రెండూ స‌మంత‌నే. కేవ‌లం స‌మంత కోస‌మే త్రివిక్ర‌మ్ ఈ సినిమా తీశాడ‌న్న టాక్ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో ఇప్పుడు చ‌క్క‌ర్లుకొడుతోంది. రిలీజ్ అయిన అఆ ట్రైల‌ర్ చూసినా ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ క‌ట్ కూడా.. స‌మంత కోణంలోనే సాగింది. నితిన్ ప‌లికింది ఒకే ఒక్క డైలాగ్‌! నిజానికి ఇదో లేడీ ఓరియెంటెడ్ స్ర్కిప్ట్‌. క‌థానాయ‌కుడు.. ఇందులో ఓ పాత్ర మాత్ర‌మే. సినిమా మొత్తం స‌మంత చుట్టూనే తిరుగుతోంది. అంటే బాలీవుడ్‌లో వ‌చ్చిన జ‌బ్ వుయ్ మెట్ లాంటి క‌థ‌న్న‌మాట‌. అందులో క‌రీనాక‌పూర్‌లా.. స‌మంత ఈసినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకొని న‌డిపిస్తుంద‌న్న‌మాట‌. ఎంత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా.. హీరో ఉండాలి క‌దా? అందుకోసం నితిన్‌ని వాడుకొన్నార‌న్న‌మాట‌. అందుకే త్రివిక్ర‌మ్ కూడా... ''నితిన్ కేవ‌లం క‌థ‌ని న‌మ్మి ఈ సినిమా ఒప్పుకొన్నాడు'' అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. సినిమా హిట్ట‌యితే క్రెడిట్ మొత్తం స‌మంత ఖాతాలోకి వెళ్లిపోతుంద‌ని, నితిన్ కేవ‌లం నిమిత్త‌మాత్రుడిగా మిగ‌ల‌డం ఖాయ‌మ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయినా నితిన్ ఈ సినిమా విష‌యంలో హ్యాపీగానే ఉన్నాడు. ' త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం ఓ వ‌రం ' అన్న‌ది నితిన్ ఫీలింగ్‌. అందుకే త‌న క్యారెక్ట‌ర్ గురించి కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమా ఒప్పేసుకొన్నాడన్న‌మాట‌.