English | Telugu
పవన్ కళ్యాణ్ కి ఆడియో మీద ఉన్న శ్రద్ధ
Updated : Jul 22, 2011
పవన్ కళ్యాణ్ కి ఆడియో మీద ఉన్న శ్రద్ధ చూస్తే చాలా ముచ్చటగా ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మనం గనక పవన్ కళ్యాణ్ తొలిచిత్రం నుంచీ జాగ్రత్తగాగమనిస్తే ఆయన సినిమాల్లోని పాటలన్నీ చాలా వైవిధ్యభరితంగా ఉండి, యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయనేది మనకర్థం అవుతుంది. అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడితో మాట్లాడి తనకు ఎలాంటి సంగీతం కావాలో క్లియర్ గా చెప్పటం వల్లే అది సాధ్యమవుతుందనేది నిజం. ప్రస్తుతం విష్ణువర్థన్ దర్శకత్వంలో, తను హీరోగా నటిస్తున్న "కాళీ" చిత్రానికి కూడా సంగీతం చాలా విభిన్నంగా ఉండేలా పవన్ కళ్యాణ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అందుకు "కాళీ" చిత్ర సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాతో కూడా హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడారనీ, ఈ సినిమా సంగీతం కచ్చితంగా యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందనీ ఈ చిత్రం యూనిట్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గత చిత్రం "కొమరంపులి" ఆశించిన స్థాయిలో విజయమ సాధించకపోవటంతో ఈ చిత్రం విజయం సాధించటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలనూ హీరో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారట.