English | Telugu

సమ్మర్ లోనే 'సర్దార్‌' సందడి

'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సంక్రాంతికి విడుదల అవ్వబోతుందని పవన్‌ చెప్పిన మూడు వారాలోనే సినిమా మూడు నెలలు వాయిదా పడిపోయిందిప్పుడు!! సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' యూనిట్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలవుతుందట. సంక్రాంతికే పవన్ వచ్చేస్తాడని టాలీవుడ్ భావించింది. అయితే పవన్ మాత్రం ఏ మాత్రం కంగారు అవసరం లేదని క్వాలిటీ ప్రమోషన్ విషయంలో టైం తీసుకునైనా పర్ఫెక్ట్ గా ముందుకెళదామని సూచించాడట. దీంతో ఏప్రిల్ కే డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి హైద్రాబాద్ లో పలు యాక్షన్ కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ నెల 17నుంచి గుజరాత్ లో షూటింగ్ జరుపనున్నారు.