English | Telugu

మెగాస్టార్ 'కత్తి' లేనట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం అదిగో ఇదిగో అని తెగ ఊద‌ర‌గొట్టారు మొన్న‌టివ‌ర‌కూ. కానీ ఇప్పుడు ఎక్క‌డా ఆ ఊసు కూడా విన‌బ‌డ‌లేదు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘కత్తి’ రీమేక్ ను కూడా పక్కనబెట్టేశారని తెలుస్తోంది. ఇదే విషయం ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వినాయక్ కూడా అడగగా మాట దాటవేశారు. అస్సలు ఉంటుందో లేదో కూడా చెప్పలేదు. తర్వాత చెబుతా.. ఇప్పుడు కాదు.. అని విషయాన్ని దాచేసే ప్రయత్నం చేశారు. అసలు 150వ సినిమా ఉందా? లేదా? అన్న సందేహాలొచ్చాయి అందరికీ. మరోసారి చెబుతాను. వేరొక ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను.. అంటూ వినయ్ ఆ సంగతిని ప్రస్థావించకపోవడం నిజంగానే పలువురిని నిరాశపరిచింది. ఏదేమైనా ప్రస్తుతం మెగా సినిమా డౌట్ఫుల్ అని అంటున్నారు.