English | Telugu

వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!

ఇంతవరకు డ్యూయల్ రోల్ చేయని మహేష్!
ఇప్పుడు వారణాసిలో ఏకంగా ఐదు పాత్రల్లో సర్ ప్రైజ్!

హీరోగా రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు(Mahesh Babu) డ్యూయల్ రోల్ చేయలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. 'నాని' సినిమాలో మాత్రమే కాసేపు డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ లో ఇంతవరకు నటించలేదు. అలాంటి మహేష్ బాబు.. ఇప్పుడు రెండు పాత్రల్లో కాదు, ఏకంగా ఐదు పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

'వారణాసి'లో మహేష్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలతో పాటు.. మరో మూడు పాత్రలలో మహేష్ కనువిందు చేయనున్నాడట. అందులో ఒకటి శివుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మిగతా రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఒక్కో పాత్రలో మహేష్ కనిపించే తీరు సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.

Also Read: ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!

ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది మహేష్ ఏకంగా ఐదు పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి.. ప్రతి పాత్రని ఎంత గొప్పగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

'వారణాసి'లో మహేష్ ఐదు పాత్రలు పోషిస్తున్నాడనే వార్త నిజమైతే మాత్రం.. ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.