English | Telugu
చరణ్‌ని వదిలేసిన చిరు??
Updated : Nov 4, 2015
బ్రూస్లీ ప్రభావం మెల్లమెల్లగా రామ్‌చరణ్‌వ్యక్తిగత జీవితంపైనా పడుతోందా?? బ్రూస్లీ రిజల్ట్ అటు చిరంజీవి ఈగోల్నీ దెబ్బతీసిందా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. బ్రూస్లీ ఫ్లాప్ అవ్వడంతో చరణ్ కంటేచిరునే ఎక్కువ పీలవుతున్నాడట. తన 150 వసినిమా క్రేజ్ తగ్గడానికి బ్రూస్లీ ఓ కారణమని చిరు ఫీలౌతున్నాడట. అందుకే చరణ్‌పై గుస్సాగా ఉన్నాడని టాక్.
అసలు బ్రూస్లీ వసూళ్ల గురించీ బాక్సాఫీసు రిపోర్ట్ గురించీ ఇప్పటి వరకూ చరణ్‌ని ఏమీ అడగలేదట. `అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొన్నావ్..` అంటూ చరణ్ నే తప్పుపడుతున్నాడట చిరు. అంతేకాదు.. `ఇక నుంచి నీ సినిమాల విషయంలో నేను జోక్యం చేసుకోను` అని తేల్చి చెప్పేశాడని టాక్. నిజానికి చరణ్ సినిమాల విషయంలో చిరు విపరీతమైన జోక్యం చేసుకొంటుంటాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచీ ఫైనల్ కాపీ వచ్చేంత వరకూ చిరు ప్రమేయం ప్రతి విషయంలోనూ ఉంఉటంది.
అయితే బ్రూస్లీ, తని ఒరువన్ సినిమాల విషయంలో చరణ్ సొంత నిర్ణయాలే నడిచాయి. అందుకే బ్రూస్లీ ఫ్లాప్ అయ్యిందని చిరు భావిస్తున్నాడట. ఆ కోపంతోనే `నీ కథలు నువ్వే విను .. నువ్వే నిర్ణయాలు తీసుకో` అంటూ తెగేసి చెప్పేశాడట. డాడీ కోపాన్ని అర్థం చేసుకొన్న చరణ్.. చిరుని కూల్ చేయడానికి చూస్తున్నాడని టాక్.