English | Telugu
పవన్ దర్శక, నిర్మాతల గుండెల్లో భయం
Updated : Mar 19, 2014
పవన్ ప్రజలకు సేవా చేయాలనీ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి "జనసేన" అనే పార్టీని స్థాపించాడు. ఇదంతా కేవలం రాష్ట్రం రెండుగా విడిపోయిందని మాత్రమే కాకుండా దేశాన్ని దోచుకుతింటున్న అవినీతిపరులను ఎండగట్టడానికి అని పవన్ చెప్పాడు. తను ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేసేస్తాను అని కూడా అన్నాడు. ఈ మాట వినడానికి అభిమానులకు పండగలా అనిపిస్తుంది కానీ... పవన్ ఒప్పుకున్న దర్శక, నిర్మాతలు మాత్రం గుండెను గట్టిగా పట్టుకొని కూర్చున్నారు.
ఇటీవలే "గబ్బర్ సింగ్ 2" ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఎంతో కాలంగా ఈ స్క్రిప్టు కోసం దర్శకుడు సంపత్ నంది కష్టపడ్డాడు. అంతే కాకుండా పవన్ ను నమ్ముకొని ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించాలని ఈ చిత్ర నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ పవన్ మాత్రం తన సినిమాలు పూర్తి చేస్తాను అనడమే తప్ప.. ఈ సినిమాల గురించి ఆలోచించడమే లేదు. అలాగే "ఓ మై గాడ్" రీమేక్ చిత్రం కూడా అయోమయంలో ఉంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఎవరైనా ధైర్యం చేసి పవన్ ను ఈ సినిమాల గురించి అడిగితే సినిమా మధ్యలోనే ఆపేస్తాడో లేక మళ్ళీ తనను ఈ సినిమా నుండి తప్పించి వేరే వారితో చేస్తాడేమో అనే భయంతో ఎవరూ ఆ ధైర్యం చెయ్యట్లేదు.
మరి ప్రజల గురించి ఆలోచించే ముందుగా... తనకోసమే ఎదురుచూస్తున్న చిత్ర దర్శక, నిర్మాతల గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే వారం రోజుల్లో ఏదో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నాయి. పవన్ ఈ దర్శక నిర్మాతల ఆవేదన ఎప్పుడు అర్థం చేసుకుంటాడో చూడాలి.