English | Telugu

పవన్ కళ్యాణ్ జోకరవుతాడా

పవన్ కళ్యాణ్ జోకరవుతాడా అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు...వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఆంధ్ర ప్రేక్షకుల మనసుల్లో హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య "100% లవ్" సినిమా చూశారట. ఆ తర్వాత సుకుమార్ ని పర్సనల్ గా అభినందించారు పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ఒక కథ చెప్పారట. ఆ కథ నచ్చిన అల్లు అరవింద్ ఆ కథతో తమ గీతా ఆర్ట్స్ పతాకంపై ఆ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట.

ఆ సినిమా పేరే "జోకర్". అయితే ఆ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చిందట. ఇక్కడ గొడవేంటంటే పవన్ కళ్యాణ్‍ కూడా పవన్ క్రియెటీవ్ వర్క్స్ అనే బ్యానర్ ని స్థాపించాడు. ఆ బ్యానర్ పై హిమదీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" అనే సినిమాని "గబ్బర్ సింగ్" పేరుతో తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో, తానే హీరోగా నటిస్తూ నిర్మించాలనుకున్నాడు. కానీ ఆ సినిమాని గణేష్ నిర్మిస్తున్నాడు. మరి "జోకర్" సినిమా నిర్మాత ఎవరవుతారో కాలమే చెప్పాలి.