Read more!

English | Telugu

సూపర్ స్టార్ తర్వాత పవర్ స్టార్


మూడుఏళ్లలో పవన్ సినిమా కెరీర్‌కి స్వస్తి పలుకుతాడా.. టాలీవుడ్ వర్గాలలో ఇదే టాకు మొదలైంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో వార్త కూడా ఊపందుకుంది. ఈ మూడేళ్లలో ఆయన కాల్ షీట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారట. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్నేషనల్ సంస్థ పవన్2కు తమ ప్రాజెక్టు ఒప్పుకుంటే 50 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు తెరపై కనిపిస్తే చాలు కలెక్షన్లు వచ్చిపడతాయి. వారికి దేశవిదేశాల్లో అంత మార్కెట్టు కూడా వుంది. ఇప్పుడు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కి మార్కెట్ వుండటం వలనే ఇంత మొత్తం ఆయనకు ఆఫర్ చేస్తున్నారని కూడా అంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలు అమీర్ ఖాన్, రితిక్ రోషన్, అక్షయ్ కుమార్ లకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇది ఎక్కువ కావడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విషయం ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరో రజనీకాంత్. ఆ తర్వాత స్థానం పవన్ దక్కించుకోబోతున్నాడని అభిమానులు అప్పుడే ఆనంద పడిపోతున్నారు. ఏమైనా పవన్‌కి వచ్చిన ఈ ఆఫర్ తెలుగు సినీ పరిశ్రమలోనే కొత్త రికార్డు నెలకొల్పనుంది అంటున్నారు పలువురు.