English | Telugu
చిరంజీవి 'విశ్వంభర'లో పవన్ కళ్యాణ్!
Updated : May 6, 2024
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల ఆశ. ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే.. బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే త్వరలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తెరను పంచుకొని, అభిమానులను ఖుషీ చేసే అవకాశముందని తెలుస్తోంది.
చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర' (Vishwambhara) . యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిడివి తక్కువైనప్పటికీ, కథని మలుపు తిప్పే కీలక పాత్ర కావడంతో.. పవన్ ని రంగంలోకి దింపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం, వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అసలుసిసలైన మెగా మాస్ జాతర చూస్తాం అనడంలో డౌట్ లేదు.
కాగా, గతంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో పవన్ ఒక పాటలో సందడి చేశారు.