English | Telugu

పవన్ పుస్తకం పేరు ఇదేనా...?

 

"గబ్బర్ సింగ్" సినిమాలో పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు చెప్పే కొన్ని డైలాగులను (ఆణిముత్యాలు) ఆలీ చేత రాయిస్తాడు గుర్తుందా? ఆ పుస్తకంకు "నేను నా పైత్యం" అనే పేరును కూడా పెడతాను అని అంటాడు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం పవన్ రాజకీయాల గురించి ఓ పుస్తకం విడుదల చేయబోతున్నాడు. మార్చి 14న పవన్ తన రాజకీయ ఎంట్రీ గురించి ప్రసంగించబోతున్నాడు. ఈ కార్యక్రమంలో పవన్ తన పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే అసలు పవన్ ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టాడో అని అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. ఆ సినిమాలో మాదిరిగానే పవన్ తన ఈ రాజకీయ పుస్తకానికి "నేను నా పైత్యం" అనే పేరు పెడతాడో లేదో మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఏదేమైనా పవన్ పైత్యం అభిమానులకు పండగే మరి.