English | Telugu

మళ్ళీ జల్సా రిపీట్ అవుతుందా?

 

గతంలో పవన్ నటించిన "జల్సా" చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన "జల్సా" చిత్రం ఘన విజయం సాధించింది.

అయితే మళ్ళీ పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న"అత్తారింటికి దారేది" చిత్రంలో కూడా మహేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా లేదా వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలిసింది.

 

ఏది ఏమైనా కూడా ఈ సస్పెన్స్ కి తెర పడాలంటే ఈ చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు(జూలై 19)న శిల్పకళా వేదికలో జరుగనుంది.