English | Telugu

కాక పుట్టించడానికి మరోసారి...?

 

త్రివిక్రమ్ తో ఎఫైర్ పెట్టుకొని భారీ మొత్తంలో తన దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిన హాట్ లేడి పార్వతి మెల్టన్ మరోసారి తన అందాలతో అలరించడానికి సిద్ధమవుతుంది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోయిన ఐటెం సాంగ్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ అయిపోయాయి. కానీ పెళ్ళికి ముందు తన అందాలతో ఎంత హాట్ గా కనిపించిందో... ఇప్పుడు కూడా అలాంటి ఫిజిక్ ని మెయింటేన్ చేస్తుందట. దాంతో ఈ అమ్మడికి తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చింది.

కమల్ హాసన్ నటిస్తున్న "ఉత్తమ విలన్" చిత్రంలో ఓ మాస్ మసాలా హాట్ ఐటెం సాంగ్ ఉందట. ఈ పాటకోసం దర్శకుడు రమేష్ అరవింద్ ఈ అమ్మడిని సంప్రదించాడట. పార్వతి కూడా వెంటనే ఒప్పేసుకుందట. అయితే ఈ పాట చాలా హాట్ హాట్ గా ఉంటుంది అని చెబితే.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వండి అందాలు ఆరబోస్తాను అంటూ దర్శకుడికి హాట్ ఆఫర్ ఇచ్చేసిందట. దాంతో ఈ అమ్మడు అడిగిన దానికంటే కాస్త ఎక్కువగానే ఇస్తానని అంగీకరించనట్లు తెలిసింది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారు.

అసలే అవకాశాలు లేక, సినిమా ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి అవకాశం రావడం గొప్ప విషయమే. మరి ఈ పాటలో పార్వతి జనాలను ఏ విధంగా పిచ్చేక్కించే అందాల ప్రదర్శన చేస్తుందో త్వరలోనే తెలియనుంది.