English | Telugu

దర్శకేంద్రుడిని అడిగి మరి ఆ..పని చేయమందట

కె.రాఘవేంద్రరావు బీ.ఏ..జనం నాడి తెలిసిన డైరెక్టర్..తెలుగు సినిమాను మాస్ జనాలకు దగ్గర చేసిన డైరెక్టర్. హరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా..హీరోయిన్లను అందంగా చూపించాలన్నా రాఘవేంద్రుడి స్టైల్ ప్రత్యేకం. ముఖ్యంగా రోమాంటిక్ సాంగ్స్ పిక్చరైజేషన్‌లో దర్శకేంద్రుడి తర్వాతే ఎవరైనా..హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్లు కొట్టడం అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది బహుశా రాఘవేంద్రరావు గారితోనే స్టార్టయ్యిందనుకుంటా.

ఒక్కసారి ఈయన చేతుల్లో పడితే సాదాసీదా భామలు కూడా స్టార్ హీరోయిన్లు అయిపోవాల్సిందే..అందుకే కెరీర్‌లో ఒక్కసారైనా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించాలని హీరోయిన్లు కోరుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్‌కి దర్శకేంద్రుడి దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. శ్రీవారి పరమభక్తుడు హాథీరామ్ బాబా జీవితగాథతో తెరకెక్కిన "ఓం నమో వెంకటేశాయ" సినిమాలో కింగ్ నాగార్జునతో జత కట్టింది ప్రగ్యా.

ఈ సినిమాలో ఒక రోమాంటిక్ సాంగ్‌ ఉంది.. రాఘవేంద్రరావు డైరెక్టర్, మన్మథుడు నాగార్జున‌ హీరో కావడంతో తన బొడ్డుపై పూలు, పండ్లు వేస్తారని ఆశపడిందట ప్రగ్యా. కాని రెండు రోజులు గడిచినా అలాంటిదేమి లేకపోయే సరికి..బాధపడిన ఈ అమ్మడు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి నా బొడ్డుపై పూలు, పళ్లు వేయాలని కోరిందట. అంతే..ఆమె కోరికను కాదనలేకపోయిన ఆయన ఆ తర్వాతి రోజు షూటింగ్‌లో ప్రగ్యా బొడ్డుపై నాగార్జునతో పూలు వేయించాడట..దాంతో ప్రగ్యా ఆనందానికి అంతేలేకుండా పోయింది.