English | Telugu

ఇది నిజమా రాజమౌళి ?

బాహుబలి పై వచ్చినన్ని గాసిప్స్ మరే సినిమాపై రాలేదేమో. కొబ్బరికాయ్ కొట్టినప్పటినుండి బాహుబలి చుట్టూ ఎన్నో వార్తలు. ఎంతో మంది స్టార్ నటీనటులు పేర్లు ప్రస్తావిస్తూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అందులో చాలా రూమర్లుగానే మిగిలిపోయాయి. ఒక విధంగా ఇలాంటి రూమర్లె బాహుబలిని నిరంతరం వార్తల్లో నిలిచేలా చేశాయి. ఇప్పుడు తాజాగా మరో గాసిప్. అదేంటంటే.. బాహుబలి2కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అని. ఇందులో కొన్ని కీలక పాత్రలు, సన్నివేశాల ముగింపులకు మెగాస్టార్ వాయిస్ అయితే బావుంటుందని యూనిట్ బావిస్తుందని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

బాహుబ‌లి సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చింది ‘బాహుబలి. ఏకంగా రూ.600 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసి, సినీ అభిమానుల్ని నివ్వెర‌ప‌రిచింది. స‌రికొత్త చ‌రిత్ర లిఖించి.. తెలుగు బాక్సాఫీసు సగ‌ర్వంగా త‌లెత్తుకొనేలా చేసింది. అయితే పార్ట్ వన్ తో పోల్చుకుంటే బాహుబలి 2కి ఇంకా ఆ స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదు అనే మాట వినిపిస్తుంది. జనరల్ గా వాయిస్ ఓవర్ లు హైప్ కోసం వాడుతుంటారు. బాహుబలికి చిరు వాయిస్ అంటే ఒక అదనపు ఆకర్షణే. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళ్, మలయాళంలోకి వెళుతుంది కాబట్టి అక్కడ టాప్ స్టార్లతో వాయిస్ ఓవర్ చెబితే ఓ స్పెషల్ ఎట్రాక్షన్ చేరే అవకాశం అయితే వుంది. మరి, రాజమౌళి ఈ దిశగా ఆలోచిస్తున్నారేమో.