English | Telugu

అఖిల్ పెళ్లిలో ఊహించ‌ని ట్విస్టు

అఖిల్‌, శ్రియా భూపాల్ బ్రేక‌ప్‌.... టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఎంత త్వ‌ర‌గా క‌లిశారో, అంత త్వ‌ర‌గా విడిపోయార‌ని...సినీ బంధాలు ఇంతేన‌ని వేదాంత ధోర‌ణిలో మాట్లాడుకొన్నారంతా. అయితే.. వాళ్ల‌కు మ‌రోసారి షాక్ ఇస్తూ... అఖిల్‌, శ్రియా మ‌ళ్లీ క‌ల‌సిపోతున్నార్ట‌. అవును... అఖిల్‌, శ్రియ బ్రేక‌ప్ ఇప్పుడు ప్యాచ‌ప్‌గా మార‌బోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అఖిల్‌, శ్రియ‌ల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల సంప్ర‌దింపులు స‌ఫ‌లీకృత‌మ‌య్యాయ‌ని, వీళ్లిద్ద‌రూ క‌ల‌సిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల నాగ్, జీవీకే ఫ్యామిలీ మ‌ధ్య మ‌రోసారి సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని, జ‌రిగిందంతా మ‌ర్చిపోయి ఒక్క‌టైపోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ సంబంధం వ‌దులుకోవాల‌ని నాగార్జున‌కి ముందు నుంచీ లేదు. నాగ్ బ‌ల‌వంతం మీదే... జీవీకే ఈ పెళ్లి జ‌ర‌ప‌డానికి ఒప్పుకొంద‌ని.. త్వ‌ర‌లోనే ప్యాచ‌ప్ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. అయితే... ఈ పెళ్లి విష‌య‌మై జీవీకే ఫ్యామిలీ కొన్ని కండీష‌న్లు పెట్టింద‌ని... వాటి గురించి నాగార్జున తీవ్రంగా ఆలోచిస్తున్నాడ‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. అఖిల్ పెళ్లిలో కొత్త ట్విస్టు ఏం వ‌స్తుందో చూడాలి.