English | Telugu

ఆమె ఆశలన్నీ వాటిపైనేనంట

 

పవన్ కళ్యాణ్ "పులి" చిత్రంతో తెలుగు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కు ఆ తర్వాత పెద్దగ సినిమా అవకాశాలేమి రాలేవు. అయితే ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన తాజా చిత్రం "ఓం". 3Dలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 19న విడుదల కానుంది. అయితే ఈ చిత్ర విడుదలకు ముందే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయట. దీంతో నికిషా ఫుల్ హ్యాపీ లో ఉందట.

 

ప్రస్తుతానికి రెండు చిత్రాలను అంగీకరించినట్లు తెలిసింది. మొన్నటి వరకు ఆఫర్లు రాకపోవడంతో హైదరాబాద్ లో ఎక్కడా ఉండాలో తెలియక అయోమయంతో హోటల్ లో అద్దెకున్న ఈ అమ్మడు.. ఇపుడు ఏకంగా చెన్నయ్ లో ఇల్లును కొనేసింది. త్వరలోనే హైదరాబాద్ కు మకాం మార్చే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది.

 

అయితే నికిషా ఇంత సంతోషంగా ఉండటానికి గల కారణం ఏమిటో మరి తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఆమె "ఓం" చిత్రంపై భారీగా ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా హిట్టయితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ పెంచిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు.