English | Telugu
బాబాయ్ బాలకృష్ణకి యన్.టి.ఆర్.వార్నింగ్
Updated : Apr 8, 2011
బాబాయ్ బాలకృష్ణకి యన్.టి.ఆర్.వార్నింగ్ ఇచ్చాడని ఫిలిం నగర్ లో పుకారు కోడై కూస్తోంది. బాలయ్యను చూస్తేనే గడగడలాడే యన్ టి ఆర్ కి అంత సీనుందా...? బాబాయ్ యువరత్న నందమూరి బాలకృష్ణ కే వార్నింగిస్తాడా....? అని కంగారు పడకండి. అత్యంత భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాలతో ఇటీవల విడుదలైన తాను నటించిన "శక్తి" చిత్రం ఘోర పరాజయం చవిచూడటంతో తన తప్పు ఏమిటనే ఆలోచనలో పడ్డాడు యన్ టి ఆర్. అయితే "శక్తి" చిత్ర దర్శకుడు బాలకృష్ణకు ఒక కథ చెప్పగా అది నచ్చిన బాలయ్య ఆ సినిమాకి అంగీకరించాడట.
ఈ విషయం తెలుసుకున్న యన్.టి.ఆర్ బాబాయ్ బాలకృష్ణను కలసి "మెహేర్ కథ అద్భుతంగా చెపుతాడు. అంతవరకే నమ్ము బాబాయ్. కానీ ఆ కథకు తెరరూపం ఇవ్వటంలో నా దగ్గర అప్పుడు "కంత్రీకి", ఇప్పుడు "శక్తి"కీ పూర్తిగా విఫలమయ్యాడు. కంత్రీనేమో "పోకిరి" మించుద్దన్నాడు. శక్తినేమో "మగధీర"ని బీట్ చేస్తుందన్నాడు. కానీ ఏమయ్యింది. ఒకదాన్ని మించిన ఘోరమైన ఫ్లాపు మరొకటయ్యింది. కనుక బాబాయ్ మేమెర్ ను నమ్మి అతనికి నువ్వు హీరోగా నటించే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం మాత్రం ఇవ్వొద్దు. నేను రెండుసార్లు అతనిచేతిలో దెబ్బతిన్న అనుభవంతో చెప్తున్నాను" అని వార్నింగిచ్చాడట. అదండీ వార్నింగ్ సంగతి. మరి దీంట్లో నిజమెంతో యన్ టి ఆర్, బాలకృష్ణలకే తెలియాలి.