English | Telugu
లిపోసక్షన్ ముందు, తర్వాత మన హీరోలు
Updated : May 21, 2011
లిపోసక్షన్ ముందు, తర్వాత మన హీరోలు ఎలా ఉన్నారు అన్న విషయం మీద ఫిలిం నగర్ లో చర్చ జరుగుతూంటే అదే విషయం మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం ఇక్కడిస్తున్నాం. వివరాల్లోకి వెళితే మన సినీ హీరోలు శరీరాన్ని ఇష్టానుసారంగా పెంచి, ఆ తర్వాత ఆ శరీరాన్ని ఎలా తగ్గించాల్రా దేవుడా అంటూ తలలు పట్టుకుని కూర్చునే సమయంలో ప్రముఖ పాప్ గాయకుడు అద్నాన్ సమీ దేవుడిలా కనిపించాడు. కారణం ఏమిటంటే అద్నాన్ సమీకి అత్యంత భారీ ఊబకాయం ఉండేది. అతను తన భారీ శరీరాన్ని లిపోసక్షన్ అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా అంచలంచెలుగా తగ్గించుకుని మామూలు మనిలా తయారయ్యాడు.
అది చూసిన దగ్గర నుంచీ మన హీరోలకు కూడా ధైర్యం వచ్చింది. ముందుగా "రాఖీ" సినిమాలో నటించేటప్పుడు యన్ టి ఆర్ ని చూస్తే నలుగురు పిల్లల తండ్రిలా ఉండేవాడు. "యమదొంగ" సినిమాకి వచ్చేటప్పటికి మళ్ళీ తన వయసుకి తగ్గట్టుగా సన్నగా తయారై కుర్రాడిలా కనిపించాడు. అలాగే "ఢీ" సినిమాలో విష్ణు కూడా భారీ కాయంతో కనిపించాడు. కానీ "సలీమ్" సినిమాలో శరీరం బాగా తగ్గించుకుని కనిపించాడు.
ఇవన్నీపక్కన పెడితే "రోబో" ఆడియో లాంచ్ సమయంలో రజనీ కాంత్ ని చూసి మళ్ళీ స్ఫూర్తి పొందిన మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాల్లో నటించటానికి తన శరీరాన్ని తగ్గించుకున్నాడు. ఈ ముగ్గురు హీరోలూ లిపోసక్షన్ ద్వారానే తమ తమ శరీరాల్లోని అనవసర కొవ్వుని తీసేసుకుని స్లిమ్ అయ్యారు. లిపోసక్షన్ ముందు, తర్వాత మన హీరోలు ఎలా ఉన్నారు అనేది చూడటానికి మీకా ఫొటోలను అందిస్తున్నాం. చూడండి.