English | Telugu

ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో ఎన్టీఆర్‌తోపాటు మరో స్టార్‌ హీరో.. ఆ ఛాన్స్‌ ఎవరిది?

రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అరవింద సమేత తర్వాత సోలో హీరోగా చేసిన దేవర ఇటీవల పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే బాలీవుడ్‌ మూవీ వార్‌2 సెట్స్‌కి వెళ్లిపోయారు ఎన్టీఆర్‌. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్‌కి సంబంధించిన పోర్షన్‌ త్వరలోనే పూర్తవుతుందని తెలుస్తోంది. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో చేసే సినిమా షూటింగ్‌కి షిఫ్ట్‌ అవుతారు ఎన్టీఆర్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసేశారు ప్రశాంత్‌. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 

ఒక మాఫియా డాన్‌ లైఫ్‌ స్టోరీ ఇన్‌స్పిరేషన్‌గా ప్రశాంత్‌ ఈ కథను తీసుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే తరహాలో హీరో క్యారెక్టర్‌ ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి జోడీగా రుక్మిణీ వసంత్‌ పేరును పరిశీలిస్తున్నారని టాక్‌. ఇప్పటివరకు బయటకు రాని ఒక విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తోపాటు మరో హీరో కూడా కనిపిస్తారన్న ఆ న్యూస్‌. ఎన్టీఆర్‌తోపాటు మరో క్యారెక్టర్‌కు కూడా ఈ కథలో ఇంపార్టెన్స్‌ ఉంటుందట. అయితే ఆ క్యారెక్టర్‌ను ఏ హీరోతో చేయించాలి అనే విషయం గురించి ప్రశాంత్‌ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇది ఎన్టీఆర్‌ సోలో హీరో సినిమా అయినప్పటికీ ఒక సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారు అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ పోర్షన్‌ మినహాయించి షూట్‌ చేస్తున్నారు ప్రశాంత్‌. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటారు.