English | Telugu

సొంత బ్యానర్లోనే భారీగా వసూలు చేస్తున్న చిరంజీవి..!

చిరంజీవి 150 వ సినిమా అతి త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌బోతోంది. జూన్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈలోగా క‌త్తి రీమేక్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే... ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం తీసుకొంటున్నాడ‌ట‌. నిజానికి ఈ సినిమాని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్. కొణెదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఓ బ్యాన‌ర్ స్థాపించి, అందులో తీస్తున్న తొలి సినిమా ఇది. సొంత బ్యాన‌ర్ కాబ‌ట్టి చిరుకి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవొచ్చు. కానీ లెక్క లెక్కే. బ‌డ్జెట్ లో చిరు పారితోషికం పేరుతో రూ.30 కోట్లు వేశార‌ట‌. ఆ లెక్క‌న టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకొనే క‌థానాయ‌కుడు చిరంజీవే అవుతాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబుల పారితోషికం రూ.25 కోట్ల‌లోపే! ఆ అంకెల్ని దృష్టిలో ఉంచుకొని చిరు పారితోషికాన్ని ఇలా డిసైడ్ చేశార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. సొంత బ్యాన‌ర్‌లో సినిమా కాబ‌ట్టి ఇష్ట‌మొచ్చిన అంకెలు వేసుకోవొచ్చు. రేప్పొద్దుట 151వ సినిమాకి మ‌రో నిర్మాత కూడా ఇంతే ఇస్తాడా?? బ‌య‌టి నిర్మాత చిరుకి పారితోషికం ఎంత ఇవ్వ‌గ‌ల‌డో... అదే రికార్డుల్లో ఉంటుంది. మ‌రి 151వ సినిమా కోసం చిరంజీవి ఎంత తీసుకొంటాడో చూడాలి.