English | Telugu

నిత్య మీన‌న్‌కి క‌టింగులు ఎక్కువ‌య్యాయ్‌..!

రెండు హిట్లు ప‌డేస‌రికి ఏ క‌థానాయిక‌కైనా కొమ్ములొస్తాయ్‌. పారితోషికం ఎంతిస్తారు? నా పాత్ర ఏమిటి? ఎన్ని పాటలున్నాయ్‌? మా మ‌మ్మీకి కూడా ఫ్లైట్ టికెట్లు తీయండి... ఇలాంటి స‌వాల‌క్ష ఆర్డర్లు. అయితే నిత్యమీన‌న్ మాత్రం అందుకు విరుద్ధం. త‌న‌కు మూడ్ బాగుంటే సినిమా ఒప్పుకొంటుంది, లేదంటే లేదు. పాత్ర న‌చ్చితేనే సినిమా ఒప్పకొంటుంది, పారితోషికాల గోల లేదు. హీరో ఎవ‌రైనా ఒకేనే. అయితే ఒక్కటే బాధ‌. సినిమాని కెలికి పారేస్తుంటుంద‌ట‌. సెట్లో కూర్చుని డైలాగులు బ‌ట్టీ ప‌ట్టకుండా.... `సీన్ ఇలా తీస్తే బాగుంటుంది డైరెక్టరు గారూ..` అని స‌ల‌హా ఇస్తుంటుంద‌ట‌. డైరెక్టరు కాస్త మెత‌క మ‌నిషి అయితే.. ఆయ‌న్ని ప‌క్కన పెట్టి ఆ డైరెక్షనేదో త‌నే చేసి పారేస్తోంద‌ని టాలీవుడ్ టాక్‌.

ప్రస్తుతం నిత్యమీన‌న్ మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు సినిమాలో న‌టిస్తోంది. శ‌ర్వానంద్ హీరో. ఎక్కడైనా సెట్స్‌ల‌లో హీరోల డామినేష‌న్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇక్కడ ఇలా కాదు. నిత్యమీన‌నే అజ‌మాయిషీనే ఎక్కువ‌ట‌. కెమెరా యాంగిల్స్‌తో స‌హా సీన్లు మార్చి.. త‌న సొంత ప్రతిభ చూపించ‌డానికి ట్రై చేస్తోంద‌ట‌. మ‌రోవైపు క్రాంతిమాధ‌వ్ కూడా నిత్య చెప్పిన‌ట్టే చేస్తున్నాడ‌ట‌. `సెట్లో ఒక‌రు కాదు.. ఇద్దరు ద‌ర్శకులున్నట్టే అనిపిస్తోంది. అటు నిత్య, ఇటు క్రాంతి ఇద్దరూ డైరెక్షన్ చేసేస్తున్నారు..` అంటూ ఈ సినిమాకి ప‌నిచేస్తున్న ఓ టెక్నీషియ‌న్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నిత్యమీన‌న్‌కి క‌టింగులు ఎక్కువ‌య్యాయి. మ‌న‌సు డైరెక్షన్ వైపు పోతోందేమో. అంత మ‌క్కువ ఉంటే హాయిగా సినిమా తీసుకోవ‌చ్చు క‌దా..?? లేదంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని ఛాన్సు అంటూ.. త‌న డైరెక్షన్ డెబ్యూకి ఈ సినిమాని ఓ ట్రైట‌ర్‌లా వాడుకొంటుందేమో...?