English | Telugu

చరణ్ కాదు.. విజయ్ ని వెతుక్కుంటూ వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్!

చరణ్ కాదు.. విజయ్ ని వెతుక్కుంటూ వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్!

 

నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేసిన 'కిల్' అనే యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ హిందీలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని తెలుస్తోంది. నగేష్ భట్ తన నెక్స్ట్ ఫిల్మ్ ని తెలుగు హీరోతో చేయడం వరకు నిజమే కానీ, రామ్ చరణ్ తో కాదని సమాచారం. 

 

రీసెంట్ గా నగేష్ భట్ హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండను కలిశాడట. ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగాయని, కలిసి పని చేయడానికి ఇద్దరూ అంగీకారం తెలుపుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను కరణ్ జోహార్ నిర్మించనున్నాడట. (Vijay Deverakonda)

 

విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత దర్శకులు రాహుల్‌ సాంకృత్యాయన్‌, రవికిరణ్ కోలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత విజయ్-నగేష్ భట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.