English | Telugu

రెండో పెళ్ళికి రెడీ అయిన నిహారిక.. వరుడు ఎవరంటే..?

2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela).. ఏవో కారణాల వల్ల మూడేళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న నిహారిక తన పూర్తి దృష్టిని సినిమాలపైనే పెడుతోంది. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైందనే వార్త ఆసక్తికరంగా మారింది.

మళ్లీ పెళ్లి ఎప్పుడనేది చెప్పలేను కానీ, తనకు సరిపోయే వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాను అని గతంలో నిహారిక ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు నిహారిక రెండో పెళ్ళికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దల మధ్య మాటలు పూర్తయ్యాయని, ఈ ఏడాది వీరి వివాహం జరిగే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది. 

కాగా నిహారిక నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే నిర్మాతగానూ రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలాగే 'వాట్ ది ఫిష్' అనే సినిమాలోనూ నిహారిక నటిస్తోంది.