English | Telugu
సునంద మర్డర్‌పై మూవీ
Updated : Feb 10, 2015
సమాజంలో ఏ సంచలన ఘటన జరిగినా దాన్ని సినిమాగా తీసేయాలని తహతహలాడే రామ్‌గోపాల్ వర్మ, లేటెస్ట్ గా మరో మర్డర్ మిస్టరీ ని సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మరణం రకరకాల మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో సహజ మరణం అని అందరూ భావించిన, ఆతరువాత మలుపులు తిరిగి అది హత్య అని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మర్డర్ మిస్టరీ పై సినిమా తీయడానికి రామ్‌గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే సునందా పుష్కర్ మరణంపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే సినిమా చిత్రీకరణ మొదలుపెడతానని అంటున్నాడట.