English | Telugu
మెగా హీరో ఆశలన్నీ పూరి మీదే
Updated : Feb 5, 2015
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజకు ఇండస్ర్టీలో నిలబెట్టే బాధ్యతను పూరీ జగన్నాథ్ భుజాన వేసుకుంటున్నారు. వరుణ్ తేజ నటించిన తొలి సినిమా ముకుంద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. దీంతో కమర్సియల్ సినిమా ఫార్మేట్ ను కాచి వడబోసిన పూరీ జగన్నాథ్ కు వరుణ్ బాధ్యత అప్పగిస్తున్నారట. ఇంతకుముందు మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్ కు బద్రితో, అల్లు అర్జున్ కు దేశముదురుతో, రాంచరణ్ కు చిరుతతో హిట్లిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వరుణ్ కు కూడా ఓ హిట్టిచ్చే బాధ్యత ఆయనపైనే వేసినట్లు తెలుస్తోంది. ముకుంద రిజల్ట్‌తో ఇప్పట్లో రిస్క్ తీసుకోరాదని డిసైడైన వరుణ్, రిస్క్ చేసి ఫ్లాప్ కొని తెచ్చుకోడం కంటే సేఫ్ గేమ్ ఆడడం సబబని తెలుసుకున్నాడు.