English | Telugu

చిన్న హీరోల్లో నాని పవర్‌స్టారే..!!

చిన్న చిన్న విజయాలతో స్టార్‌గా ఎదుగుతూ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్‌ని.. మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్నాడు నాని. నేచురల్ పర్ఫామెన్స్‌తో కంటతడి పెట్టించడం.. అమాయకత్వంతో గిలిగింతలు పెట్టగల సత్తా ఉన్న నటుడు నాని. ఆయన సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అందుకే సినిమా.. సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న నాని ఈ ఏడాది రెండు సూపర్‌హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

రీసెంట్‌గా వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని నటించిన ఎంసీఏ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్‌ అందుకున్న ఎంసీఏ.. బాక్సాఫీసు వద్దా దుమ్ము దులిపిందట. ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని లాస్ట్ మూవీ నిన్నుకోరి కంటే రెండింతలు ఎక్కువట. దీంతో నేచురల్ స్టార్ కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించే హీరోలు కొందరే ఉంటారు. తమిళ్‌లో రజనీకాంత్.. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌కి ఆ సత్తా ఉందంటారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు చిన్న హీరోల్లో నాని అదే కోవలోకి వస్తాడంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.