English | Telugu

బాలయ్య మనసు మారొచ్చా ??

నందమూరి బాలకృష్ణ 101 సినిమా ప్రకటన వచ్చింది. తన దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా అంటూ స్వయంగా ప్రకటించాడు పూరి జగన్నాథ్. బాలయ్య అభిమానులకు మహాశివరాత్రి కానుక అంటూ అదే రోజు ఈ సినిమా ప్రకటన చేశాడు పూరి. సినిమా ప్రకటించిన రోజే రిలీజ్ డేట్ చెప్పడం పూరికి అలవాటు. ఈ సినిమా పై కూడా అంతే కాన్ఫిడెంట్ గా క్లారిటీ ఇచ్చాడు. మార్చి 9న సినిమా ప్రారంభోత్సవం జ‌రుపుకుని, సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు పూరి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చాడు.

బాలయ్యతో పూరి సినిమా ప్రకటన ఒక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత చాలా కధలు విన్నారు బాలయ్య. కృష్ణవంశీ రైతు కధతో ఎప్పటి నుండో రెడీగా వున్నారు. ఆయనే కాదు శ్రీవాస్, కేఎస్ రవికుమార్, ఎస్వి కృష్ణా రెడ్డి కధ.. ఇలా చాలా మందిపేర్లు ఆయన కొత్త సినిమా కోసం వినిపించాయి. అయితే సడన్ సర్ ప్రైజ్ లా పూరి సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రకటన వచ్చిందే కానీ ఈ సినిమాపై ఇప్పటివరకూ తనవంతుగా స్పందించలేదు బాలయ్య. ఇప్పుడు ఇదే కాస్త అనుమానంగా వుంది.

బాలయ్య నిర్ణయాలు అన్నీ చాలా విచిత్రంగా వుంటాయి. ఎవరికి ఎప్పుడు అవకాశం ఇస్తారో ఉహించలేం. అలాగే ఆయన ఇచ్చే షాకులు కూడా డిఫరెంట్ గా వుంటాయి. బాలయ్య మనసు మారిందంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు పూరి సినిమాపై కూడా ఇలా సెకెండ్ థాట్ కు వచ్చే అవకాశం వుందని భోగట్టా. సినిమా ప్రకటన వచ్చిందే కానీ బడ్జెట్ లెక్క చూసుకున్న తర్వాత నిర్మాత కోణం నుండి ఆలోచిస్తే ఆయనకి ఎక్కడో తేడా కొట్టిందట. దర్శకుడు రేమ్యునిరేషన్ విషయంలో కూడా ఆయన అంత కంఫర్ట్బుల్ గా లేరట. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆయన సెకెండ్ థాట్ కు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.