English | Telugu

శివాజీనే "మా" రాజానా..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" అధ్యక్ష పదవికి గత సంవత్సరం జరిగిన ఎన్నికలు ఎంత రచ్చ చేశాయో కొత్తగా చెప్పక్కర్లేదు. రెండు వర్గాలుగా చిలీపోయిన నటీనటులు విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు, పై ఎత్తులతో సార్వత్రిక ఎన్నికలను తలపించారు. ఏకంగా మీడియా సాక్షిగా మాటల యుద్ధం మామూలుగా సాగలేదు. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరికి విజయం రాజేంద్రప్రసాద్‌ను వరించింది. అంతా బాగానే ఉంది కాని నటులు మాత్రం జనం విమర్శలతో నవ్వుల పాలయ్యారు.

అయితే అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవికాలం ముగియనుండటంతో ఈ సారి ఎంత రచ్చ అవుతుందోనని ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడిచాయి. కాని ఏ చడీ..చప్పుడు లేకుండా మా అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్నికల మాట ఎత్తకుండా తమలో తాము ఓ మాట అనుకుని ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేశారు. ప్రస్తుతం మా సెక్రటరీగా ఉన్నశివాజీరాజాను అధ్యక్షుడిగా, సెక్రటరీగా సీనియర్ హీరో నరేష్‌‌ను ఎన్నుకున్నట్లు సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.