English | Telugu

"నేను ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదు"-నమిత

"నేను ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదు" అని నమిత అంటుంది. వివరాల్లోకి వెళితే తెలుగులో సొంతం, జెమిని సినిమాల్లో హీరోయిన్ గా నటించి, అనంతరం మొన్నటి సింహా వంటి సినిమాలో వ్యాంప్ తరహా పాత్రలను పోషిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో సెల్సీ భామగా ఇమేజ్ సంపాదించుకున్న భారీ అందాల బొద్దుగుమ్మ నమిత ఈ మధ్య ముంబాయిలోని ఒక లాయర్ తో డేటింగ్ చేస్తుందని తెలిసింది.

ఈ విషయంపై విలేఖరులు నమితను స్పందించవలసిందిగా కోరగా, అవన్నీ అబద్ధాలనీ, తాను ఏ లాయర్ తో కానీ, మరెవరితో కానీ డేటింగ్ చేయటం లేదనీ ఆమె అన్నారు. తాను నటిగానే ఇంకా కొన్నాళ్ళు కొనసాగుతాననీ అన్నారు నమిత. నమిత ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తూంది. తమిళంలో కూడా నమితకు మంచి డిమాండ్ ఉంది.