English | Telugu
ఒకే ఒక్కడు సీక్వెల్.. ముఖ్యమంత్రి పాత్రలో చరణ్!!
Updated : Jul 17, 2021
మెగా పవర్ స్టార్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ పాత్ర గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. గతంలో అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకే ఒక్కడు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తో శంకర్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమాకి కూడా అలాంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని శంకర్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో చరణ్ మొదట కలెక్టర్ పాత్రలో కనిపించి.. ఆ తర్వాత సీఎంగా మారి వ్యవస్థలోని లోపాలను ఎలా సరిచేస్తాడట. ఓ రకంగా ఇది ఒకే ఒక్కడు కు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది.
చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.