English | Telugu
బాహుబలి మీద ఖాన్ లు కుళ్ళుకుంటున్నారా?
Updated : May 5, 2017
ప్రపంచం నివ్వెరపోయేలా బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఆమిర్ ఖాన్ పీకే 740 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు ఇది ఇండియన్ సినిమా స్టామినా అని బాలీవుడ్ గర్వంగా చెప్పుకుంది. అదే, ఒక తెలుగు సినిమా అన్ని రికార్డులు బద్దలు కొడుతుంటే ఖాన్ లందరు ఇళ్ళకి డోర్ లు వేసుకొని అసలు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి ఉద్దండ పిండాలు బాహుబలి గురించి గొప్పగా మాట్లాడుతుంటే, ఖాన్ త్రయం మాత్రం దక్షిణాది సినిమాలంటే ఎంత చిన్న చూపో చెప్పకనే చెబుతున్నారు. ఒక గొప్ప సినిమా గురించి అందరు మాట్లాడుతున్నప్పుడు, ఒక మాట మాట్లాడితే తమ సొమ్మేం పోదు కదా. వీళ్ళందరూ కుళ్ళుకోవడం కాకపోతే, ఇంత రచ్చ జరుగుతుంటే మౌన వ్రతం చేయడమేంటి. అదే ఖాన్ త్రయంలో ఎవరో ఒకరు ఇంతటి ఘన విజయం సాధిస్తే అప్పుడూ ఇలాగే నిమ్మకు నీరెట్టినట్టుగా మిన్నకుండిపోయేవాళ్ళా. ఒక రకంగా వాళ్ళు బాహుబలి ని దక్షిణాది సినిమా గానే భావిస్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే, దేశం గర్వించదగ్గ సినిమా తీసిన రాజమౌళిని అభినందించకుండా ఉండేవాళ్లా? రాజమౌళి గత చిత్రం ఈగ హిందీ లో మక్కీ గా విడుదలయినపుడు ఈయనేంటి చిన్నపిల్లల సినిమా తీసాడని విమర్శించారు. బాహుబలి ని ఒక భారతీయ సినిమా గా భావిస్తూ ఉత్తరాది ప్రేక్షకులే ఇప్పుడు బ్రహ్మరధం పడుతుంటే, ఖాన్లు మాత్రం ఈ రికార్డుల్ని ఎలా బద్దలు కొట్టాలా అని ఆలోచిస్తున్నట్టున్నారు. నిజంగా, ఇప్పట్లో ఏ ఖాన్ కైనా బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేసే సత్తా ఉందా? ఫుల్ రన్ కలెక్షన్స్ క్రాస్ చేయొచ్చు... కానీ, మొదటి రోజు, మొదటి వారాంతం, మొదటి వారం రికార్డులు దాటడం వాళ్ల సాధ్యం కాదు, మీరేమంటారు!