English | Telugu

చైతు దుర్గ ఆగిపోయిందట...!

 

"తడాఖా" సినిమా తర్వాత నాగచైతన్య టైం అసలేం బాగోలేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే నాగచైతన్య హీరోగా నటించిన "ఆటోనగర్ సూర్య" నాలుగు నెలల క్రితమే విడుదల కావలసింది. కానీ ఆర్థిక సమస్యల వలన ఇప్పటికీ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. అలాగే అక్కినేని కుటుంబం అంతా కలిసి నటిస్తున్న "మనం" సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఉగాది కోసం ఎదురుచూస్తుంది. అలాగే ఇటీవలే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో చైతన్య, హన్సిక జంటగా "దుర్గ" అనే చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యింది. సి.కళ్యాణ్ నిర్మాత. కానీ ఇపుడు ఈ సినిమా కూడా ఆగిపోయినట్లుగా తెలిసింది. హీరో, దర్శకుడికి మధ్యన ఏదో విషయంలో మనస్పర్ధలు వచ్చి సినిమా షూటింగ్ పక్కకి పెట్టినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి చైతన్య సినిమాల పరిస్థితి ఏంటో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.