English | Telugu

డప్పు పార్టీని పక్కకు పెట్టినట్లేనా ?

 

రాంచరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో "గోవిందుడు అందరివాడేలే" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాను తీసుకున్నట్లు తెలిసింది. గతకొద్దికాలంగా అదే డప్పు సౌండ్ తో విసుగు తెప్పిస్తున్న తమన్ పై అభిమానులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా వంశీకి చాలా కాలంగా హిట్టు లేకుండా పోయింది. అందుకే ఈ సినిమాను ఎలాగైనా విజయం సాధించాలని వంశీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.