English | Telugu

ధ‌నుష్ తో అజ‌య్ పాన్ - ఇండియా మూవీ?

`ఆర్ ఎక్స్ 100`తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు అజ‌య్ భూప‌తి. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. `మ‌హాస‌ముద్రం` అనే మ‌ల్టిస్టార‌ర్ చేస్తున్నాడు. శ‌ర్వానంద్, సిద్ధార్థ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 14న `మ‌హాస‌ముద్రం` థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. అజ‌య్ భూప‌తి త‌న మూడో చిత్రాన్ని ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా చేయ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు.. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ కాంబినేష‌న్ లో ఈ సినిమాని చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అలాగే.. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ధ‌నుష్ - అజ‌య్ భూప‌తి కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మ‌రి.. ధ‌నుష్ తో తీయ‌బోతున్న ఈ పాన్ - ఇండియా మూవీతో అజ‌య్ ఎలాంటి గుర్తింపుని పొందుతాడో చూడాలి.

కాగా త‌మిళ‌, హిందీ, ఆంగ్ల చిత్రాల‌తో బిజీగా ఉన్న ధ‌నుష్.. త్వ‌ర‌లో టాలీవుడ్ బాట ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మ‌రో చిత్రం క‌మిట‌య్యాడు ధ‌నుష్. ఈ క్ర‌మంలోనే.. అజ‌య్ భూప‌తికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌న్న‌ది లేటెస్ట్ బ‌జ్.