English | Telugu
ఎన్టీఆర్ సినిమా కాపీనా??
Updated : Mar 4, 2017
ఎన్టీఆర్ కొత్త సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరూ ఆసక్తికరంగా చర్చించుకొంటున్న విషయం ఇదే! ఎన్టీఆర్ - బాబి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. అయితే ఈ కథ ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్రచారం జోరందుకొంది. తమిళంలో విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులోనూ.. విజయ్ త్రిబుల్ రోలే పోషిస్తున్నాడు. ఓ పాత్రలో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయట.
ఈ రెండు సినిమాల కథలూ ఒక్కటే అని.. రెండూ ఓకే హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్రచారం జోరందుకొంది. విజయ్ చిత్రానికి మన రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఆయనపై పాత సినిమాల ప్రభావం చాలా ఎక్కువే ఉంది. భజరంగీ భాయ్ జాన్ కథకి పసివాడి ప్రాణం సినిమా స్ఫూర్తి అని ఆయన బహిరంగంగానే చెప్పారు. మగధీర గ్లాడియేటర్ నుంచి స్ఫూర్తి తీసుకొన్న సినిమా. మర్యాద రామన్న కూడా హాలీవుడ్ సినిమాకి కాపీనే. అలానే. ఇప్పుడు విజయ్ కథనీ ఆయన హాలీవుడ్ నుంచి ఎత్తేశారని, అదే కథతో ఎన్టీఆర్ - బాబిల సినిమా తెరకెక్కుతోందన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.