English | Telugu

'RC15'లో ముఖ్యమంత్రిగా మోహన్ లాల్!

మలయాళ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. 'మనమంతా', 'జనతా గ్యారేజ్' వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం పోషిస్తుండగా.. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ కూడా ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెకండాఫ్ లో చరణ్, మోహన్ లాల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. ఈ వార్త నిజమైతే చరణ్, మోహన్ లాల్ మధ్య వచ్చే సన్నివేశాలు కన్నుల పండగలా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.