English | Telugu
రావణ బ్రహ్మగా కిలెక్షన్ కింగ్
Updated : May 10, 2011
"రావణ బ్రహ్మ"గా కిలెక్షన్ కింగ్ నటిస్తున్నారని ఫిలిం నగర్ లో వినపడుతోంది. వివరాల్లోకి వెళితే విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా, విద్యాదాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు మళ్ళీ హీరోగా నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. అదికూడా "రావణ బ్రహ్మ"పాత్రలో ఆయన నటించనున్నారట. డైలాగ్ మాడ్యులేషన్ లో మోహన్ బాబుది ఒక ప్రత్యేకమైన వినూత్నశైలి. ఆ డైలాగ్ మాడ్యులేషన్ వల్లే మహానటులు యన్ టి ఆర్ తో పోటీపడి మరీ నటించి గుర్తింపు తెచ్చుకోగలిగారు మోహన్ బాబు.
ఇంతకీ మోహన్ బాబు "రావణ బ్రహ్మ"గా నటించబోయే చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారట. గతంలో రాఘవేంద్ర రావు, మోహన్ బాబుల కాంబినేషన్ లో "అల్లరి మొగుడు,అల్లుడుగారు, మేజర్ చంద్రకాంత్" వంటి చక్కని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఈ సినిమా ఏద్వారా వారి కాంబినేషన్ లో రాబోయే చిత్రం ఎలా ఉండబోతుందో మరి. ఈ "రావణ బ్రహ్మ" సినిమా గనక పౌరాణికమో, చారిత్రాత్మకమో అయితే, గతంలో "శ్రీ మంజునాథ", "అన్నమయ్య", "శ్రీరామదాసు", "పాండురంగడు" వంటి చక్కని సినిమాలనందించిన ఘనత రాఘవేంద్రరావుకి ఉంది.