English | Telugu

మెగాస్టార్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా `ఆచార్య‌`?

రి-ఎంట్రీలో `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా.. న‌ర‌సింహారెడ్డి`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేప‌థ్యంలో.. చిరు నుంచి రానున్న‌ కొత్త చిత్రం `ఆచార్య‌`పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. వ‌రుస విజ‌యాలతో ముందుకు సాగుతున్న కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డం.. చిరుతో పాటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా మ‌రో హీరోగా న‌టిస్తుండ‌డం.. చాన్నాళ్ళ త‌రువాత మెగాస్టార్ - మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డం.. ఇలాంటి ఎన్నో అంశాలు `ఆచార్య‌`పై ఎన‌లేని ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా జూన్ 18కి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా ప‌డింద‌ని రీసెంట్ గా ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్ గా ఆగ‌స్టు 22న ఈ సినిమాని రిలీజ్ చేయాల‌ని `ఆచార్య‌` టీమ్ ప్లాన్ చేస్తోంద‌ట‌. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.