English | Telugu

మ‌హేశ్‌తో నిధి అగ‌ర్వాల్?

`అత‌డు` (2005), `ఖ‌లేజా` (2010).. ఇలా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో త‌ను తీసిన రెండు సినిమాల్లోనూ ఒకే క‌థానాయిక‌కి స్థాన‌మిచ్చారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. `అత‌డు`లో త్రిష హీరోయిన్ గా న‌టించ‌గా.. `ఖ‌లేజా`లో అనుష్క నాయిక‌. క‌ట్ చేస్తే.. మ‌హేశ్ తో ముచ్చ‌ట‌గా మూడోసారి చేయ‌బోతున్న సినిమాకి మాత్రం ఫార్ములాని మార్చి.. గ‌త కొంత‌కాలంగా త‌ను ఫాలో అవుతున్న ఇద్ద‌రు నాయిక‌ల ట్రెండ్ ని కొన‌సాగిస్తున్నారు త్రివిక్ర‌మ్.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఓ నాయిక‌గా `బుట్ట‌బొమ్మ‌` పూజాహెగ్డేని ఎంచుకున్న త్రివిక్ర‌మ్.. తాజాగా మ‌రో హీరోయిన్ గా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగ‌ర్వాల్ ని సెలెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ సినిమాలో నిధి అగ‌ర్వాల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం నిధి రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తోంది. అందులో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా న‌టిస్తున్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` కాగా.. మ‌రొక‌టి మ‌హేశ్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లాకి జంట‌గా న‌టిస్తున్న సినిమా.

కాగా, మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ కి సంబంధించిన అధికార‌క ప్ర‌క‌ట‌న.. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజున రానుంద‌ని టాక్.