English | Telugu

విష్ణ్టుతో వర్మ టెన్షన్ టెన్షన్..?

 

మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో "రౌడీ" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో విష్ణుని బాగా గమనించిన వర్మ మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. విష్ణు కోసం ప్రత్యేకంగా ఓ కథ సిద్ధం చేస్తున్నాడట. ఇది పూర్తిగా హరర్ నేపధ్యంలో ఉంటుందని తెలిసింది.

"ఢీ", "దూసుకెళ్తా" వంటి ఎంటర్ టైనర్ సినిమాలలో నటించి విష్ణు జనాలను అలరించాడు. ఇప్పటివరకు కామెడి, యాక్షన్ లతో అదరగొట్టిన విష్ణుతో భయపెట్టడానికి వర్మ ఒక కొత్త కథని సిద్ధం చేస్తున్నాడట. ఈ చిత్రానికి "టెన్షన్ టెన్షన్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల చివర్లో మొదలుకానుందని సమాచారం.