English | Telugu

మనం పబ్బు పాటలో కిక్కులేదు

 

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం "మనం". విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మాత నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని "పియో పియోరే..." అనే పాట తాజాగా ఇంటర్ నెట్ లో హాల్ చల్ చేస్తుంది. పబ్బులో ఎంజాయ్ చేస్తూ సాగే పాట ఇది. ఈ పాటలో కేవలం నాగార్జున, నాగచైతన్య మాత్రమే కనిపించేలా కేవలం ఫొటోస్ మాత్రమే పెట్టారు. కానీ ఈ పాటలో అక్కినేని కూడా "నేను పుట్టాను ..." అంటూ చిన్న చిన్న స్టెప్పులు కూడా వేసాడని ఈ పాట వింటే అర్థం అవుతుంది.

కానీ ఈ పాట పబ్బుల్లో పెట్టుకొని ఎంజాయ్ చేసే విధంగా లేదని అనిపిస్తుంది. అనూప్ ఇంకాస్తా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. గతంలో నితిన్ "ఇష్క్" సినిమాలో అనూప్ అందించిన "కోడిబాయే లచ్చమ్మది.." అనే పాట రేంజులో ఉంటే "మనం" సినిమాలోని ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యేది. కానీ పాటలో కాస్త కిక్కు తగ్గినప్పటికీ కూడా సినిమాటోగ్రఫీ పరంగా ఈ పాటను చాలా అధ్బుతంగా చిత్రీకరించారని తెలుస్తుంది. మరి ఈ పాటకు అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేసి, సినిమాను మే 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

Source from AnnapurnaStudios